Site icon Prime9

Manchu Vishnu Tweet:తమ్ముడితో వివాదం వేళ మంచు విష్ణు షాకింగ్‌ ట్వీట్‌ – ఆ డైలాగ్‌ మనోజ్‌ని ఉద్దేశించేనా?

Manchu Vishnu Tweet Goes viral: గతకొన్ని రోజులు మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఏదోక వివాదంలో మంచు వారి గొడవలు రచ్చకెక్కుతున్నాయి. ఆస్తి విషయంలో అంతర్గత కలహాలు తీవ్రం అయ్యాయనేది ఇండస్ట్రీలో టాక్‌. కానీ బయటకు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? మనోజ్‌, విష్ణుల మధ్య వైర్యం ఏంటనేది తెలియక అంతా డైలామాలో ఉన్నారు. ఈ గొడవలన్ని చూస్తుంటే మనోజ్‌పై తండ్రి మోహన్‌ బాబు కూడా గుర్రుగా ఉన్నారనేది స్పష్టం అవుతుంది.

మొన్నటి వరకు మంచు ఫ్యామిలీ వివాదం సద్దుమణిగినట్టు కనిపించాయి. కానీ సంక్రాంతి పండుగ వేళ మళ్లీ రచ్చకెక్కాయి. పండుగ సందర్భంగా మనోజ్‌ తన నానమ్మ,తాతయ్య సమాధులు సందర్శించిన నివాళులు అర్పించేందుకు భార్య మౌనికతో కలిసి తిరుపతి వచ్చాడు. ఈ క్రమంలో 200 మందితో మోహన్‌ బాబు యూనివర్సిటీ లోపలికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మనోజ్‌కి యూనివర్శిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. అయినా మనోజ్‌ అనుచరులు గేట్లు దూకి లోనికి ప్రవేశించడంతో యూనివర్సిటీ సిబ్బంది, ప్రైవేట్ బౌన్సర్లు భయంతో పరుగులు తీశారు.

దీంతో మనోజ్‌ అనుచరులు వారిపైకి రాళ్లు విసరడంతో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అదుపు చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటన తర్వాత వారిపై రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. తనని లోనికి రాకుండ అడ్డుకున్న యూనివర్సిటీ సిబ్బందితో పాటు మోహన్‌ బాబు పీఏ మరో ఏడుగురిపై మనోజ్‌ ఫిర్యాదు చేశాడు. ఇలా మరోసారి మంచు ఫ్యామిలీ వివాదాలు తెరపై వచ్చిన వేళ మంచు విష్ణు చేసిన ఓ పోస్ట్‌ ఆసక్తి రేకిస్తుంది. మోహన్ బాబు సినీ ప్రస్థానానికి 50ఏళ్లు నిండిన సందర్భంగా మంచు విష్ణు రౌడీ సినిమాలోని ఓ డైలాగ్‌ షేర్‌ చేశాడు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది.

కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావని ఆశ” అని మోహన్‌ బాబు చెప్పిన డైలాగ్‌ని షేర్‌ చేశాడు. దీనికి “నా ఫేవరేట్‌ మూవీ, డైలాగ్‌లో ఇది ఒకటి. నాకు ఎంతో ఇష్టమైన రామ్‌ గోపాల్‌ వర్మ అందించిన ఈ సినిమాలోని ప్రతి డైలాగ్‌ ఓ స్టేట్‌మెంట్‌” రాసుకొచ్చాడు. తన తండ్రి మోహన్‌బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జతచేశాడు. ప్రస్తుతం మంచు విష్ణు ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఆయన షేర్‌ చేసిన ఈ డైలాగ్‌ పరోక్షంగా మంచు మనోజ్‌ని ఉద్దేశించి చేశారా? అని నెటిజన్స్ సందేహిస్తున్నారు. ఒకవేళ అదే అయితే మనోజ్‌ రియాక్షన్‌ ఎలా ఉండనుందా అనేది ఆసక్తిని సంతరించుకుంది.

Exit mobile version