Site icon Prime9

Manchu Manoj Weddding : ఘనంగా మంచు మనోజ్ – భూమా మౌనిక పెళ్లి .. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

manchu manoj marriage with bhuma mounika reddy

manchu manoj marriage with bhuma mounika reddy

Manchu Manoj Weddding : టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో  శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్‌- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరు ఎక్కడా స్పందించలేదు. అలాగే తమ పెళ్లి గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు.

అయితే శనివారం ఉదయం తన పెళ్లిపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మనోజ్. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు మనోజ్. కొత్త పెళ్లి కూతురిగా ముస్తాబైన మౌనిక ఫోటోను షేర్ చేస్తూ.. ఎం వెడ్స్ ఎం.. మనోజ్ వెడ్స్ మౌనిక.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా మనోజ్‌ పెళ్లి వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించింది మంచు లక్ష్మీ. ఈ సందర్భంగా తనే స్వయంగా సోదరుడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసింది. మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం.

2015 లో ప్రణతితో మనోజ్ వివాహం (Manchu Manoj Weddding)..

2015లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజులకే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో ఇద్దరూ విడిపోయారు. ఇక భూమా మౌనిక విషయానికి వస్తే ఆమె గతంలో బెంగుళూరుకి చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్..భూమా మౌనిక రెడ్డితో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వీరి వివాహం గురించి అనేకసార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే మనోజ్, భూమా మౌనిక ప్రేమ వ్యవహారం బయట పడ్డప్పటి నుంచి కొన్ని పుకార్లు వైరల్ అవుతూ వచ్చాయి. మోహన్ బాబుకి ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఆయన పెళ్లి వేడుకకి హాజరయ్యేందుకు కూడా అయిష్టంగా ఉన్నారని కూడా ప్రచారం చేశారు.

మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరూ రెండు బలమైన కుటుంబాల నుంచి రావడంతో వీరి వివాహం పై అందరిలో ఆసక్తి నెలకొంది. మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదనే పుకార్లకు చెక్ పెడుతూ మోహన్ బాబు దంపతులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. మంచు మనోజ్ పెళ్లి కి అతని సోదరుడు మంచు విష్ణు దంపతులు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి డైరెక్టర్ బాబీ, సింగర్ సునీత, వెన్నెల కిషోర్, బిఎస్ రవి, తేజ సజ్జా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మొత్తానికి మంచు మనోజ్ తన కొత్త జీవితాన్ని మౌనికతో ప్రారంభించడంతో మంచు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. మంచు మనోజ్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version