Site icon Prime9

Jawan Movie : షారుఖ్ “జవాన్” మూవీపై మహేష్ బాబు సూపర్ రెస్పాన్స్.. ఏమన్నారంటే ?

mahesh babu response on sharukh khan jawan movie

mahesh babu response on sharukh khan jawan movie

Jawan Movie : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. షారుఖ్ నటిస్తున్న విషయం తెలిసిందే. “జవాన్” పేరుతో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేశారు. కాగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొడుతుంది. మొదటి రోజు కలెక్షన్స్ లో పఠాన్ రికార్డులను సైతం క్రాస్ చేసి కొత్త రికార్డులను సృష్టించింది ఈ సినిమా.

సౌత్ మాస్ మసాలాకి నార్త్ క్రేజ్ తోడు అయితే ఎలా ఉంటుందో ఈ మూవీ రుజువు చేస్తుంది. తాజాగా మహేష్ బాబు సినిమా చూసి జవాన్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ లో బ్లాక్ బస్టర్ సినిమా జవాన్. కింగ్ తో అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ ఫిలిం ఇది. షారుఖ్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. షారుఖ్ మంచి ఫైర్ మీద ఉన్నాడు. జవాన్ సినిమా షారుఖ్ సొంత సినిమా రికార్డులనే బద్దలు కొడుతుంది. లెజెండ్ అని పొగుడుతూ పోస్ట్ చేశాడు. దీంతో మహేష్ బాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

 

 

 

Exit mobile version