Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.
The Reigning Superstar @urstrulymahesh in an all new MASS avatar is all set to meet you with #SSMB28 in theatres from 13th January 2024 worldwide! 🤩#SSMB28FromJAN13 🎬🍿#Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/qqXjnJphqH
— Haarika & Hassine Creations (@haarikahassine) March 26, 2023
సినిమా రిలీజ్ డేట్ ప్రకటన.. (Mahesh Babu)
సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. మహేష్ బాబు తన తర్వాతి చిత్రంలో మాస్ లుక్కులో కనిపించనున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు మహేష్-త్రివిక్రమ్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుందనే విషయం తప్ప, ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవవుతూ వచ్చారు.
కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అనే వార్తలకు తాజాగా చెక్ పెట్టారు.
ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు ఓ బ్లాస్టింగ్ అప్డేట్‌ను ఇచ్చారు.
ఈమేరకు ఓ మాస్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో మహేష్ ఊరమాస్ అవతారంలో సిగరెట్ తాగుతూ, నడుచుకుంటూ వస్తున్నాడు.
మహేష్‌ను త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడో ఈ పోస్టర్‌తోనే చెప్పేశాడు. ఇక ఈ సినిమాపై ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ పోస్టర్ చేసిందని చెప్పాలి.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.