Site icon Prime9

Guntur Kaaram Movie : మహేష్ బాబు “గుంటూరు కారం” మూవీ నుంచి “ధమ్ మసాలా” సాంగ్ రిలీజ్..

mahesh-babu-guntur-kaaram-movie-song-update-by-movie-makers

mahesh-babu-guntur-kaaram-movie-song-update-by-movie-makers

Guntur Kaaram Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా చేస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మనందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మహేష్‌ ఊరమాస్‌ లుక్‌ అదిరిపోయింది. కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలో సమయం ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని షురూ చేశారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈ మూవీలోని సాంగ్ లీక్ అయ్యి ఫుల్ వైరల్ అయ్యింది. ఇక దిద్దుబాటు చర్యల్లో భాగంగా మూవీ (Guntur Kaaram Movie)  టీం ఈ సాంగ్ ని అఫిషియల్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించింది.

అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ప్రోమోని రిలీజ్ చేయగా.. నేడు సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టిన రోజుని పురస్కరించుకొని ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. “ధమ్ మసాలా” అంటూ సాగే ఈ పాట పక్కా మాస్ లిరిక్స్ తో దుమ్ము రేపుతుంది అని చెప్పాలి. థమన్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. సంజిత్ హెగ్డే, థమన్ పాటని పాడారు. ఇక ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఆల్రెడీ రిలీజ్ చేసిన పోస్టర్ స్టిల్స్ అండ్ గ్లింప్స్ విజువల్స్ తో పాటు కొత్తగా ఒకటి రెండు సీన్స్ ని చూపించారు. సాంగ్ అంత చూసిన తరువాత అర్థమైంది ఏంటంటే.. మహేష్ ఇప్పటివరకు కనిపించనంత మాస్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని మాత్రం అర్ధమవుతుంది. మహేష్ అభిమానులకు ఈ సినిమా థియేటర్ లో పూనకాలు తెప్పించడం ఖాయం అన్నట్లు ఉంది.

Exit mobile version