Site icon Prime9

Kushboo : ఖుష్బూకి ఆప‌రేష‌న్‌..అస్సలు ఖుష్బూకి ఏమి జరిగింది !

kushboo prime9news

kushboo prime9news

Kushboo : తమిళంలో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ప్రస్తుతం తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది.ఈమె ఉన్న‌ట్లుండి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యింది.ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.ఈ పోస్ట్ చూసిన అభిమానులు కంగారు ప‌డ్డారు.అయితే వారిని మ‌రింత గంద‌ర‌గోళానికి గురి కాకుండా ఖుష్బూ సోష‌ల్ మీడియాలోనే అస‌లు విష‌యాన్ని బయటకు వెల్లడించింది. ‘వెన్నెముకలో బాగా నొప్పి రావ‌టంతో హాస్పిట‌ల్‌లో చేరాను. బోన్ స‌ర్జ‌రీ జ‌రిగింది.మరో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న త‌ర్వాత యథావిధిగా షూటింగ్స్ లో పాల్గొంటాను’ అని చెబుతూ ఖుష్బూ ఆప‌రేష‌న్ త‌ర్వాత రెస్ట్ తీసుకుంటున్న‌ ఫొటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

సినీ ప్రముఖులతో పాటు అభిమానులందరు ఖుష్బూ త్వరగా కోలుకోవాలని ఆమె షేర్ చేసిన ఫోటోకు కామెంట్స్ చేస్తున్నారు.రీసెంట్‌గా ఖుష్బూ త‌న సోద‌రుడు అబ్దుల్లా న‌టించిన ఆడియో వేడుక‌లో పాల్గొన్నారు.ఆ తరువాత రోజునే ఆమె హాస్పిట‌ల్‌లో చేరరాని స‌న్నిహిత వ‌ర్గాలు నుంచి సమాచారం.కోలీవుడ్‌లో ఖుష్బూ అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.ప్రస్తుతం ఖుష్బూ తెలుగులోనూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు ఆమె కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ అభిమానులను మెప్పిస్తోంది.ఇప్పుడు బీజేపీ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఖుష్బూ.రీసెంట్‌గా ఆమె త‌న లుక్ విష‌యంలో కేర్ తీసుకుని బ‌రువు త‌గ్గారని తెలిసిన సమాచారం.

Exit mobile version