Site icon Prime9

Karan Johar : కరణ్ జోహార్ ని మీరు “గే” నా అని ప్రశ్నించిన నెటిజన్.. షాకింగ్ రిప్లై !

karan johar shocking reply to netizen about his gender

karan johar shocking reply to netizen about his gender

Karan Johar : బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ ఒకరు. ఇప్పటికే ఆయన పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా , ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అలాగే సెలబ్రెటీల వారసులను ఇండస్ట్రీ కి పరిచయం చేయాలంటే ముందుగా కరణ్ నే సంప్రదిస్తారు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా.. అన్ని సినీ పరిశ్రమల్లోనూ కరణ్ జోహార్ కి మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోష‌ల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడూ త‌న‌కు సంబంధించిన విష‌యాల‌తో పాటు సినిమాల వివ‌రాల‌ను పంచుకుంటూ ఉంటాడు కరణ్. అయితే ప్రస్తుతం ట్విట్ట‌ర్‌ కి పోటీగా థ్రెడ్స్ యాప్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

పలువురు ప్రముఖులు కూడా ఇప్పటికే ఇందులో త‌మ ఖాతాల‌ను ప్రారంభించారు. టాలీవుడ్ లో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు చాలా మంది థ్రెడ్స్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈ క్రమంలో తాజాగా క‌ర‌ణ్ జోహార్ కూడా థ్రెడ్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఫ్యాన్స్ తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే “ఆస్క్ కరణ్ ఎనీథింగ్” సెషన్‌ను నిర్వ‌హించారు. 10 నిమిషాల పాటు తాను అందుబాటులో ఉంటాన‌ని త‌న‌ను ఏవైన‌ ప్ర‌శ్న‌లు అడ‌గొచ్చని ప్రకటించాడు కరణ్.

దాంతో పలువురు నెటిజన్లు కరణ్ ను సినిమాలకు సంబంధించి హీరోల గురించి ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. కానీ ఓ నెటిజన్ మాత్రం కరణ్ జోహార్ ను ఇబ్బంది పెట్టేవిధంగా వేసిన ప్రశ్న అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మీరు గే క‌దా.. నిజ‌మేనా..? అని క‌రుణ్‌ను ప్ర‌శ్నించాడు. కానీ అందుకు కరణ్ మాత్రం ఆ నెటిజన్ కి ఊహించని రిప్లై ఇచ్చి.. తాను ఎంత డేర్ అండ్ డాషింగ్ గా ఉంటాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఇంతకీ ఏమని చెప్పాడంటే.. “నీకు ఇంట్రెస్ట్ ఉందా..?” అని రిప్లై ఇచ్చాడు. దాంతో కరణ్ చెప్పిన సమాధానం కూడా నెట్టింట్లోహాల్ చల్ చేస్తుంది.

Exit mobile version