Site icon Prime9

Project K Movie : ప్రభాస్ “ప్రాజెక్ట్ – కె” నుంచి నరాలు కట్ అయ్యే అప్డేట్.. మూవీలో లోకనాయకుడు.. ఏ పాత్రలో అంటే !

kamal haasan confirmed in acting prabhas project k movie

kamal haasan confirmed in acting prabhas project k movie

Project K Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. అలానే దిశా పఠాని, పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు మూవీపై అంచనాలను రెట్టింపు చేస్తుంది మూవీ టీం. మేకింగ్ వీడియోలు, గ్లింప్స్ లతో ఈ చిత్రం హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమా కాస్టింగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉండడం మూవీకి బాగా కలిసొచ్చే అంశం. ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ వంటి భారీ తారాగణం ఉన్నారు. కాగా ఇప్పుడు  తాజాగా నరాలు కట్ అయ్యే లెవెల్లో అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం.

కాగా గత కొంతకాలంగా ఈ సినిమాలో లోకనాయకుడు “కమల్ హాసన్” నటించబోతున్నట్లు సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే వార్తలను నిజం చేస్తూ కమల్ హాసన్ మూవీ నటించబోతున్నట్లు అఫిషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని, పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో.. `భూమిని కప్పి ఉంచే నీడ మాకు కావాలి. అందుకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అతనే లోకనాయకుడు కమల్‌ హాసన్‌. ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్‌ `ప్రాజెక్ట్ కే`లో భాగం అవుతుండటం ఆనందంగా ఉంది` అంటూ ఓ స్పెషల్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

కమల్ ఈ సినిమాలో విలన్ రోల్ చేయనున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే అమితాబ్ వంటి సూపర్ స్టార్ ఈ చిత్రంలో భాగం అవ్వగా.. ఇప్పుడు కమల్ కూడా వీరికి జత కట్టడంతో అంచనాలకు  కూడా అందనంతగా సినిమా రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. అదే విధంగా “ప్రాజెక్ట్ K” సినిమాలో కమల్ నటిస్తుండటంపై ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నా హృదయంలో ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం, కమల్ సర్ తో కలిసి నటించడం గౌరవం కంటే ఎక్కువ. ఆయన దగ్గర నటిస్తూ నేర్చుకోవడం గొప్ప అదృష్టం, నా డ్రీం నెరవేరబోతోంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

ఇక ప్రస్తుతం ఈ అప్డేట్ తో ఈ చిత్రం ఇండియన్ సినిమాలోనే ప్రెస్టీజియస్ గా రాబోతున్న మూవీ అనడంలో సందేహం లేదనే చెప్పాలి. మరోవైపు కమల్‌ ఫ్యాన్స్ సైతం ఈ అప్డేట్ తో పండగ చేసుకుంటున్నారు. కమల్‌ ఇటీవల `విక్రమ్‌` సినిమాతో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ అయ్యారు. త్వరలోనే ఆయన చేస్తున్న`ఇండియన్‌ 2`మూవీ కూడా రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని ప్రకటించిన విషాయం తెలిసిందే.

Exit mobile version