Site icon Prime9

Aadi Movie: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రీరిలీజ్ రేసులో “ఆది”

Aadi movie re release

Aadi movie re release

Aadi Movie: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీరిలీజ్‌ల హవా కొనసాగుతోంది. గతంలో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్న స్టార్‌ హీరోల చిత్రాలను మళ్లీ థియేటర్లో ప్రదర్శిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేసులో తాజాగా బాబాయ్ వచ్చాడు నేనెందకు ఆలస్యం చెయ్యాలనుకుంటూ అబ్బాయి కూడా “అమ్మతోడు ఎంటర్టైన్మెంట్ పక్కా ఇస్తా” అంటూ ప్రేక్షకులముందుకు మరోసారి రానున్నాడు.

ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు పోకిరి, పవన్‌ కల్యాణ్‌ జాల్సా, రీసెంట్‌గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి మూవీలను రీరిలీజ్‌ చేయగా వాటికి ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్‌ పరంగానూ అదుర్స్‌ అనిపించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఆది కూడా రాబోతోంది.

వివి వినాయక్‌ దర్శకత్వంలో తారక్‌ కెరీర్‌ల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఫ్యాక్షన్‌ డ్రామా మూవీ ‘ఆది. ఈ సినిమా తారక్ కు మంచి స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని నవంబర్ నెలలో రీరిలీజ్‌ చేసేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇండస్ట్రీకి వచ్చి 22న ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్‌లో ఈ సినిమాను మళ్లీ థియేటర్లో ప్రదర్శించాలని ఆ చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ విషయంతో నందమూరి ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటా నవంబర్‌ వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: Bala krishna: 20 ఏళ్లు పూర్తిచేసుకున్న “చెన్నకేశవ రెడ్డి”

Exit mobile version