Site icon Prime9

Janhvi kapoor: జ్యోతిష్యంపై జాన్వీ కపూర్ కి అంత నమ్మకమా?

janhvi kapoor

janhvi kapoor

Janhvi kapoor: శ్రీదేవి, బోనీకపూర్‌ల గారాల పట్టి జాన్వీ కపూర్‌ తనకు జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉందని చెప్పారు. పలుమార్లు తన జాతక చక్రం కూడా చూపించుకున్నానని .. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి చిత్రం మీడియా సమావేశం సందర్బంగా ఈ విషయం తెలిపారు. తన రాబోయే చిత్రం మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి చిత్రం ప్రమోషన్‌లో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. తనకు జ్యోతిష్యంతోపాటు జాతక చక్రాలపై అపార నమ్మకం ఉన్నట్లు ప్రకటించి అందరిని షాక్‌కు గురి చేశారు.

ప్రతి ఒక్కరూ జాతకం చూపించుకోవాలి..(Janhvi kapoor)

అయితే తన సినిమా ప్రమోషన్‌ సందర్బంగా మీడియా సమావేశంలో విలేకరులు ఆమెను జ్యోతిశాస్ర్తంపై నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. ఈ సినిమాలో మహిమా కుండలి పాత్రలో నటిస్తున్నానని.. ఈ చిత్రం అరెంజ్‌ మ్యారేజీకి సంబంధించిందనే ఆమె వివరించారు. దీంతో పాటు ఆమె మీడియా మిత్రులతో కూడా మనలో ప్రతి ఒక్కరూ మన జాతక చక్రం చూపించుకోవాలని సూచించారు. తాను ఇప్పటికే పలుమార్లు తన జాతకచక్రం చూపించుకున్నానని అన్నారు. అలాగే జ్యోతిశాస్ర్తంపై కూడా తనకు నమ్మకం ఉందన్నారు. అయితే మన జాతక చక్రం ఫలాన వ్యక్తితో కుదరదన్నంత మాత్రాన తాను వారితో మాట్లాడ రాదనేది సరికాదన్నారు. వారితో కూడా మాట్లాడతానన్నారు జాన్వీ.

మిస్టర్‌ అండ్‌ మిస్టర్‌ మాహీలో ఆమె రాజ్‌కుమార్‌రావు సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం విషయానికి వస్తే రొమాంటిక్‌ స్పోర్ట్‌ డ్రామా. మహేంద్ర అనే వ్యక్తి క్రికెట్‌ ఆడాలని ప్రయత్నించి విఫలం అవుతాడు ఓ డాక్టర్‌ మహేంద్రకు మహిమను ఇద్దరిని కలిపి అరెంజ్‌ మ్యారేజి చేయిస్తారు. ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియో ధర్మా ప్రొడక్షన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ తో కలిసి..

ఇక జాన్వి తదుపరి చిత్రాల విషయానికి వస్తే దేవర చాప్టర్‌ 1లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సరసన నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె తంగం అనే పాత్ర పోషిస్తున్నారు. జూనియన్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు బాలీవుడ్‌ బ్యూటీ.

Exit mobile version
Skip to toolbar