Site icon Prime9

Pawan Kalyan : పవన్ క‌ళ్యాణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫస్ట్ పోస్ట్ ఇదే.. ఆ వీడియోలో ఏం ఉందంటే ?

interesting details about pawan kalyan first post on instagram

interesting details about pawan kalyan first post on instagram

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ఉన్న ఫ్యాన్  ఫాలోయింగ్ గురించి అందరికీ  తెలిసిందే. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. కాగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఒక్క పోస్ట్ కూడా పెట్ట‌కుండానే ఆయ‌న‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. దీంతో ఆయన అభిమానులంతా .. మొద‌టి పోస్ట్‌గా ఏం పెడుతారా అని అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో మొద‌టి పోస్ట్ చేశారు. ఎప్ప‌టికీ గుర్తుండిపోయే జ్ఞాప‌కాలు అంటూ రెండు నిమిషాల 40 సెక‌న్లు ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. మ‌న బంధం ఇలాగే కొన‌సాగాల‌ని, మ‌రెన్నో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల్ని పంచుకోవాల‌ని ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చారు. ఆ వీడియోలో సినిమా పరిశ్రమలోని తన సహచర నటులతో గడిపిన క్షణాలకి సంబందించిన ఫోటోలని పంచుకున్నారు. బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే అవుతుండగా పవన్ సినీ జర్నీకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి.

ఆ ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్,మహేష్ బాబు ఉన్నారు.  అలాగే సూపర్ స్టార్ కృష్ణ, దాసరి నారాయణరావు, ఎమ్మెస్ నారాయణ లాంటి లెజెండ్స్ తో ఉన్న దృశ్యాలని కూడా పంచుకున్నారు.

Exit mobile version