Manchu Vishnu Vs Manchu Manoj : మంచు మోహన్ బాబు కుమారులైన విష్ణు, మనోజ్ మధ్య వివాదం రోడ్డున పడింది. గత కొన్నాళ్లుగా విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్దలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్న క్రమంలో ఈరోజు తాజాగా మంచు మనోజ్ పెట్టిన స్టేటస్ ఈ వార్తలను మరింత బలాన్ని చేకూర్చింది. ఇంత కాలం నాలుగు గోడలు మధ్య ఉన్న ఈ వివాదం ఇప్పుడు బయటకు వచ్చింది. నా వాళ్లపై విష్ణు దాడి చేస్తున్నాడంటూ మనోజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా మనోజ్ ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇది సిచ్యుయేషన్.. ఇది సిచ్యుయేషన్ అంటున్న మనోజ్..
అసలేం జరిగిందనేది పూర్తిగా తెలియలేదు కానీ.. వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ ..‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు అంటున్నాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’ అంటూ.. ఇది సిచ్యుయేషన్.. ఇది సిచ్యుయేషన్.. చెప్తూ ఉన్నాడు. మరో వైపు మనోజ్ అంటున్నాడు. అసలు వీరి మధ్య గొడవేంటో తెలియాల్సి ఉంది. అయితే విష్ణు ఉన్న రూమ్ తలుపులు కొడుతున్న దెవరు? అసలు విష్ణుతో వాగ్వాదం చేస్తున్నదెవరు? మనోజ్ ఎక్కడి నుంచి వీడియోను తీశారనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ గొడవ జరిగినట్టు భావిస్తున్నారు.
మంచు మనోజ్ మేనేజర్ అయిన ‘సారథి’ ఇంటికి వెళ్లి మరీ విష్ణు గొడవ చేసినట్టుగా అ వీడియోలో కనిపిస్తోంది. మంచు విష్ణుని ఇద్దరు వ్యక్తులు ఆపుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలో సారథితో పాటు ఉన్న ఇంకో వ్యక్తి పేరు ‘గజ’. ఇతను మంచు ఫ్యామిలీకి పర్సనల్ సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటాడని.. మరీ ముఖ్యంగా మోహన్ బాబు సెక్యూరిటీ విషయంలో ప్రధానంగా ఉంటారని సమాచారం అందుతుంది.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ సారథి అనే వ్యక్తి వస్తున్నాడు. ఈయన మోహన్ బాబుకు వరసకు సోదరుడు అవుతారు. మొదట్లో సారథి.. విష్ణుకు కుడి భుజంలా ఉంటూ వచ్చారు. కాలక్రమేణా విష్ణు నుంచి దూరం జరిగి.. మోహన్ బాబుకు దగ్గరయ్యారు. ఈ మధ్య మంచు మనోజ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ.. అతడి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏమైందో తెలియదు కానీ సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను మనోజ్ విడుదల చేశాడు. కాగా మంచు మనోజ్.. తాజాగా డయల్ 100కి కాల్ చేశాడని.. పోలీసులు ఆయన ఇంటికి వెళ్తున్నారని.. మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల మనోజ్ పెళ్లి సమయంలో కూడా విష్ణు తన ఫ్యామిలీతో కలిసి జస్ట్ ఓ గెస్ట్‌గా మాత్రమే వచ్చి వెళ్లాడు. దీంతో వారి మధ్య గ్యాప్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి మధ్య విబేధాలు నిజమే అని తాజా ఘటనతో నిజమైంది. మరోవైపు ఈ అంశంపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాకు ఎందుకు ఎక్కారని ప్రశ్నించినట్టు సమాచారం.