Site icon Prime9

Jr Ntr – Hrithik Roshan : జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా..!

ineresting details about Jr Ntr - Hrithik Roshan movie

ineresting details about Jr Ntr - Hrithik Roshan movie

Jr Ntr – Hrithik Roshan : “ఆర్ఆర్ఆర్” సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో తారక్ చేసే నెక్స్ట్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా.. బాలీవుడ్ బ్యూటీ “జాన్వీ కపూర్” ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ చేతిలో ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ లో తారక్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి సినిమా చేయనున్నారు తారక్. హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ సినీ వర్గాలలో ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కియారా తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో పాటు రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో కలిసి శంకర్ దర్శకత్వం వహిస్తున్న “గేమ్ చెంజర్” లో చేస్తుంది. ఇక ఇప్పుడు వార్ 2 లో కూడా ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.

Exit mobile version