Site icon Prime9

Bubble Gum Movie : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘బబుల్ గమ్’ మూవీ నుంచి ‘ఇజ్జత్’ సాంగ్ రిలీజ్..

ijjath song from Bubble Gum Movie released by megastar chiranjeevi

ijjath song from Bubble Gum Movie released by megastar chiranjeevi

Bubble Gum Movie : రాజీవ్ కనకాల – సుమ కుమారుడు రోషన్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. గతంలో ‘నిర్మల కాన్వెంట్’ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రోషన్ ఇప్పుడు ‘బబుల్ గమ్’ అనే మూవీతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల సరసన మనసా చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవలే మ్యూజికల్ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘హాబీబీ’ సాంగ్ సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో రోషన్ తన ప్రెజెన్స్ తో పాటు డాన్స్ తో అదరగొట్టాడు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ‘ఇజ్జత్’ అంటూ సాగే ఈ పాటని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయడం విశేషం.

శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్ మోడ్ లో సాగింది. హైదరాబాది ర్యాప్ సాంగ్స్ తరహా లో ఉన్న ఈ పాటలో రోషన్ తన లుక్స్, ఎనర్జీతో అదరగొట్టాడు. ముఖ్యంగా కొన్ని షాట్స్ లో డాన్స్ ఇరగదీశాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ర్యాప్ సాంగ్స్ లాగే ‘ఇజ్జత్’ సాంగ్ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి రిలీజ్ చేయగా ఇప్పుడు సాంగ్ ని మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించడం చూస్తుంటే సుమ కొడుకు మూవీ (Bubble Gum Movie) కోసం గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

 

 

Exit mobile version