Site icon Prime9

RRR Movie : రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలసి నటించే అదృష్టం లభిస్తే అది అద్భుతమే – హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్

hollywood actor chris hems worth interesting words about rrr actors

hollywood actor chris hems worth interesting words about rrr actors

RRR Movie : మార్వెల్ సిరీస్.. థోర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు హీరో  క్రిస్ హెమ్స్ వర్త్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ హాలీవుడ్ నటుడు సుపరిచితుడే. అవెంజర్స్ లో ఎక్కువగా ఇష్టపడే పాత్రల్లో “థోర్” కూడ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే హేమ్స్ వర్త్‌కు ఇండియా అంటే చాలా అభిమానం అని తెలిసిందే. అందుకే తన కూతురురికి ఆయన ఇండియా అనే పేరును పెట్టాడు. ఇండియాలో తనకు ఉన్న అభిమానుల గురించి తెలిసి కూతురుకు ఆ పేరును పెట్టానని.. పలుమార్లు క్రిస్ వెల్లడించిన విషయం తెలిసిందే.

హెమ్స్ వర్త్ త్వరలోనే ‘ఎక్స్ ట్రాక్షణ్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ఎక్స్‌ ట్రాక్షన్ 2’ జూన్ 16 నాడు నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రీమియర్ అవుతుంది. 2020లో వచ్చిన ఎక్స్ ట్రాక్షన్ కు ఇది సీక్వెల్ గా రానుంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. తెలుగు హీరోలు.. ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు అయిన  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన నటులుగా వారిని అభివర్ణించారు. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇంటర్వ్యూలో క్రిస్ ఇంకా మాట్లాడుతూ..  ఆర్ఆర్ఆర్ సినిమాను ఇటీవలే చూశాను. (RRR Movie) సినిమా అద్భుతంగా అనిపించింది.. నమ్మలేకుండా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల నటన అద్భుతం అని.. ఒకవేళ వారితో కలసి నటించే అదృష్టం లభిస్తే అది అద్భుతమే అని హెమ్స్ వర్త్ తెలిపారు. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాని జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ సహా ఎంతో మంది హాలీవుడ్ దిగ్గజాలు ప్రశంసించడం తెలిసిందే. దేశ విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్లకు పైగా వరకు వసూళ్లు నమోదు చేసింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న క్రిస్ కూడా చరణ్, తారక్ లను పొగడడం పట్ల ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇండియన్ స్టార్స్ గురించి మాట్లాడని హేమ్స్ వర్త్ తొలిసారి ‘RRR’ స్టార్స్ గురించి మాట్లాడడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా..  జూనియర్ ఎన్టీఆర్‌.. కోమరం భీమ్ గా కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అలియా భట్‌, ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించగా.. అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్‌ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్‌ లోనూ ఈ సినిమాకి అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు.

Exit mobile version