Site icon Prime9

Tollywood: మహేశ్ 28 సినిమాలో కీలక పాత్రలో నటించనున్న హీరో తరుణ్

tarun prime9news

tarun prime9news

Tollywood: ప్రస్తుతం తరుణ్ గురించి ఒక వార్తా సోషల్ మెడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని అది కూడా కాంబినేషన్లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నారని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌,మహేష్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా రాబోతుందని మన అందరికీ తెలిసిన విషయమే.ఇప్పటికే వీరద్దరు కాంబినేషన్లో అతడు, ఖలేజాల సినిమాలు వచ్చాయి కానీ వీటిలో అతడు మాత్రమే సూపర్ హిట్టుగా నిలిచింది. ఖలేజా సినిమా మహేష్ కెరీయర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుండంతో ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు మొదలు అయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ లో ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలిసిన సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.మామూలుగా ఐతే త్రివిక్రమ్‌ తన సినిమాల్లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్‌ హీరోలు,హీరోయిన్స్‌ని ఖచ్చితంగా తీసుకుంటాడని మన అందిరికి తెలుసు.ఇప్పుడు SSMB28 సినిమా కోసం తరుణ్‌ని తీసుకుంటున్నారని టాలీవుడ్లో టాక్‌ బాగా వినిపిస్తుంది. కొంత కాలం నుంచి ఒక్క హిట్టు కూడా తెలుగు సినీ పరిశ్రమకు దూరమయిన తరుణ్‌ మళ్లీ త్రివిక్రమ్‌ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలిసిన సమాచారం.

తరుణ్‌ హీరోగా నటించిన నువ్వే నువ్వే సినిమా తోనే త్రివిక్రమ్‌ డైరెక్టర్‌గా తన కెరీర్‌ ప్రారంభించారన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్‌ కనిపించనున్నారని తెలిసిన సమాచారం. దీనిపై ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకా కొన్ని రోజులు రావాలిసిందే.

Exit mobile version