Site icon Prime9

హరీష్ శంకర్ తో జతకడుతున్న హీరో రామ్

Tollywood: తన చివరి చిత్రం రెడ్ పరాజయం తర్వాత హీరో రామ్ పోతినేని తన తాజా చిత్రం ది వారియర్‌ విడుదలకోసం ఎదురుచూస్తున్నాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటించింది.

రామ్ తన తదుపరి చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి పని చేయబోతున్నాడని సమాచారం. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. హరీష్ శంకర్ తో చర్చలు జరుపుతున్నానని అయితే ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదని రామ్ తెలిపాడు. ఇద్దరం చాలా కాలం పని చేయాలని ప్లాన్ చేస్తున్నామని, తమ సినిమా తప్పకుండా వస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్‌తో తన ప్రాజెక్ట్ గురించి హరీష్ శంకర్‌కి క్లారిటీ వచ్చిన తర్వాత, అతను ఈ చిత్రం గురించి మాట్లాడతాడని రామ్ పేర్కొన్నాడు.

హరీష్ గత సంవత్సరం పవన్ కళ్యాణ్‌తో భవధీయుడు భగత్ సింగ్‌ను ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు, ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి రాలేదు. మరో రెండు నెలల్లో ఇది ప్రారంభమవుతుందా అనే విషయం పై క్లారిటీ లేదు. దీంతో హరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రామ్‌తో కలిసి పని చేస్తాడనే వార్తలు మీడియాలో జోరుగా సాగుతున్నాయి. మరోవైపు దర్శకుడు గౌతమ్ మీనన్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు రామ్ తెలిపాడు.

Exit mobile version