Site icon Prime9

Natural Star Nani visits Sabarimala: శబరిమల వెళ్లిన హీరో నాని

Hero Nani

Hero Nani

Natural Star Nani: సాధారణంగా ప్రతి సంవత్సరం హీరోలు అయ్యప్ప స్వామిమాలలు ధరించి దీక్ష చేయడం  తెలిసిందే.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి హీరోలు మాలలు ధరిస్తారు. అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా అయ్యప్ప మాల దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో మాల ధరించి ఇరుముడితో శబరిమల స్వామిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల కొండకు చేరుకున్న నాని.. తన ట్రిప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నాని స్వామివారి ఇరుముడి తీసుకుని తన కుమారుడు అర్జున్‌తో కలిసి శబరిమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ శబరిమల యాత్ర వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోలో ఇరుముడితో ఆలయాన్ని కాలినడకన దర్శించుకుని పద్దెనిమిది మెట్ల వద్ద తన కుమారుడితో కలిసి దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకున్నారు

నాని ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.

Exit mobile version