Site icon Prime9

Daggubati Rana : ఆర్ఆర్ఆర్, బాహుబలి చేయలేనిది “ప్రాజెక్ట్ కె” చేస్తుంది – హీరో రానా

hero daggubati rana interesting comments on prabhas project k

hero daggubati rana interesting comments on prabhas project k

Daggubati Rana : యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులకు చేరువయ్యాడు (Daggubati Rana) రానా. ఈ మేరకు తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. ఇప్పుడు సినిమాలకు బౌండరీలు చెరిగిపోయాయి. నాకు తెలిసి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేస్తున్న ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ K ఆ బౌండరీలు మరింత చెరిపేస్తుంది. ఈ సినిమాలో అమితాబ్, దీపికా కూడా నటిస్తున్నారు. RRR, బాహుబలి సినిమాలు సాధించలేని రికార్డులు కూడా ఈ సినిమా సాధిస్తుంది. ఆ సినిమాల బౌండరీలను ప్రాజెక్ట్ K దాటుతుంది అని అన్నారు. గతంలో రానా, ప్రభాస్ కలిసి బాహుబలి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే ఇండియాలో ఇప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది.  దీంతో  (Daggubati Rana) రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇక ప్రాజెక్ట్ K సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి జనవరి 12న ప్రాజెక్ట్ K రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ తారాగణం అయిన అమితాబ్, దీపికా పదుకునే, దిశా పఠాని ఇలా ప్రముఖ స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు సమాచారం. ఇక ఇటీవలె ఈ మూవీ నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్.

ఆ వీడియో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. త్వరలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్ల వద్ద సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరో పక్క సలార్, మారుతి సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే వీటిలో సలార్, ప్రాజెక్ట్ K మూవీలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి.

Exit mobile version