Site icon Prime9

Ajith Kumar: 11 ఏళ్ల తర్వాత “అజిత్” నెగెటివ్ రోల్.. వైరలవుతున్న మూవీ పోస్టర్

Ajith kumar new movie updates

Ajith kumar new movie updates

Ajith Kumar: అటు తమిళం ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ సమానంగా క్రేజ్‌ ఏర్పరుచుకున్న స్టార్ హీరో అజిత్‌ కుమార్. కాగా ఈ ఏడాది ‘వలిమై’చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే అదే జోష్‌తో వరుసగా సినిమాలను చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు ఈ తమిళ నటుడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ముఖ్యంగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ సినిమాపై మూవీ మేకర్స్ విపరీతమైన అంచనాలను పెంచుతున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో అజిత్‌ నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ‘గ్యాంబ్లర్‌’ తర్వాత మళ్ళీ 11ఏళ్ళకు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అజిత్ కనిపించబోతున్నాడని ఫ్యాన్స్ తెగ సంబుర పడుతున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “తునివు” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో అజిత్‌కు జోడీగా మంజు వారియర్‌ నటిస్తుంది. సుముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

ఇదీ చదవండి: Shaakuntalam: సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. శాకుంతలం మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

Exit mobile version