Site icon Prime9

Guntur Kaaram : గుంటూర్ కారం నుండి మాస్ మసాలా అప్డేట్ .. సెకండ్ సింగల్ డేట్ ఫిక్స్

guntur kaaram new update

guntur kaaram new update

Guntur Kaaram : గుంటూర్ కారం మహేష్ బాబు, గురూజీ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మాటల మాంత్రికుడు మహేష్ తో మాస్ మసాలా ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా నుంచి ఏ చిన్నఅప్డేట్ వచ్చిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గుంటూరు కారం సినిమా మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. ధమ్ మసాలా అనే సాంగ్ ను రిలీజ్ చేయగా దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ క్రేజీ అప్డేట్ వచ్చింది.

గుంటూరు కారం సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. తాజాగా ఆయన ఆదికేశవ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. గుంటూరు కారం మూవీ గురించి హింట్ ఇచ్చారు. ఇంకా మూడు సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని.. త్వరలోనే ఆ సాంగ్స్ షూట్ కంప్లీట్ అవుతుందని.. అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు. అలాగే గుంటూరు కారం సెకండ్ సింగిల్ వచ్చే వారం విడుదల చేస్తామని అన్నారు. గుంటూరు కారం సాంగ్స్ సూపర్బ్ గా వచ్చినట్టు , వచ్చే ఏడాది మొత్తం గుంటూరు కారం సాంగ్స్ వినిపిస్తాయని అన్నారు నాగ వంశీ. దాంతో అభిమానుల్లో ఫుల్ జోష్ వచ్చింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Exit mobile version