Site icon Prime9

Harish Shankar: త్వరలో హరీష్ శంకర్ – విజయ్ దేవరకొండ మూవీ

Harish Shankar

Harish Shankar

Tollywood News: దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సరైన హీరో కోసం వెతుకుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేద్దామని భావించినా పవన్ బిజీ షెడ్యూల్ తో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అప్పటి నుండి హరీష్ సల్మాన్ ఖాన్‌తో సహా కొంతమంది స్టార్ హీరోల కోసం డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు, చివరకు అతను రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఒప్పించినట్లు తెలుస్తోంది

హరీష్ శంకర్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండల కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లైగర్‌ ప్లాప్ తో విజయ్ కూడ మంచి కమర్షియల్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈ తరుణంలో హరీష్ శంకర్ మంచి కమర్షియల్ కథను చెప్పాడని అతని ట్రాక్ రికార్డ్‌ను బట్టి ఓకే చెప్పాడని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది.

హరీష్ చివరి చిత్రం వరుణ్ తేజ్ యొక్క గద్దలకొండ గణేష్ .విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కుషి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అతను హరీష్ శంకర్ సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశముంది.

Exit mobile version