Site icon Prime9

Sudha Kongara: సుధా కొంగర డైరక్షన్ లో రతన్ టాటా బయోపిక్

Biopic

Biopic

Ratan Tata biopic: ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’ఆకాశం నీ హద్దు రా‘ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ చిత్రానికి సుధా కొంగర కథనంతో పాటు సూర్య నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో సుధా కొంగర తెరకెక్కించారు.

తాజా సమాచారం ప్రకారం, సుధా కొంగరకు భారతీయ లెజెండరీ వ్యాపారవేత్త రతన్ టాటా బయోపిక్‌ లో పని చేసే అవకాశం వచ్చింది. సుధా కొంగర మొత్తం రీసెర్చ్ పూర్తి చేసి స్క్రిప్ట్ వర్క్ చేయడం మొదలుపెట్టారు. రతన్ టాటా పాత్రను సూర్య లేదా అభిషేక్ బచ్చన్ తిరిగి చేస్తారని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత సుధా కొంగర మరియు ఆమె బృందం ప్రాజెక్ట్ గురించి వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు.

సుధా కొంగర 2016 లో “సాలె ఖడూస్” చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం తమిళంలో “ఇరుది సుత్రు” గా విడుదల అయింది. ఈ చిత్రం ద్వారా తమిళంలో ఉత్తమ ఫిలింఫేర్ డైరక్టర్ అవార్డు గెలుచుకున్నారు. 2017 లో గురు చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసారు.

Exit mobile version