Site icon Prime9

Pushpa 2 Promo: ‘పుష్ఫ 2’ ప్రోమో డిసెంబర్ 16న విడుదల?

Tollywood: త్వరలో ‘పుష్ప 2’ ప్రారంభం కానుందని తెలియజేసే ప్రత్యేక ప్రోమోను విడుదల చేయనున్నారు. ‘పుష్ప 2’ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్ ఇంకా టీమ్‌లో చేరలేదు. అయితే ప్రస్తుతం ఇతర నటీనటులు, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరణ జరుగుతోంది.

మరోవైపు ప్రమోషనల్ వీడియోను వచ్చే నెలలో విడుదల చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, అది డిసెంబర్ 16న ప్రేక్షకుల వీక్షించవచ్చు. ప్రోమోలో షూట్  విజువల్స్ ఉంటాయి మరియు కథ గురించి కూడా ఏదైనా క్లూ ఉండవచ్చు. దీనిపై ఇంకా అధికార ప్రకటన ఏది రాలేదు

‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది.

Exit mobile version