Tollywood Gossips: చిరంజీవి నుంచి మరో మలయాళ రీమేక్ రానుందని ఇండస్ట్రీలో ఈ వార్తా చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ తర్వాత అభిమానులు మెగా ఫ్యామిలీ రీమేక్‌లు చేయడం పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మెగా హీరోలు మాత్రం ఈ ఫీడ్‌బ్యాక్‌ని సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. “బ్రో డాడీ” మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన హాస్యభరితమైన ఎంటర్టైనర్ మరియు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వార్తా ఇంతకు ముందే చాలా సార్లు వార్తలో నిలిచింది. కాగా ఇపుడు మళ్ళీ సినీ వర్గాలలో చర్చ నడుస్తుందని టాక్. ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన మల్టీస్టారర్ బ్రో డాడీ. పృథ్వీరాజ్ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు కూడా. తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ తనయుడిగా మరో మెగా హీరో నటించే అవకాశం ఉండవచ్చు.
ఈ సినిమా చాలా పరిమిత బడ్జెట్లో తీయవచ్చు అంతేకాకుండా కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే అవకాశం చాలా ఉంది. సినిమాల్లోకి రీ-ఎంట్రీ అయిన తర్వాత చిరంజీవి తన నటనలోని కామెడీ యాంగిల్‌ని మరోసారి చూపించడానికి ఈ సినిమా స్కోప్ ఇస్తుంది. చంటబ్బాయి, దొంగ మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి హిలేరియస్ ఎంటర్టైనర్లను కూడా మెగా అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా వారి కోరికను తీర్చే ఎంటర్టైనర్గా మారుతుందని ఆశిద్దాం.