Site icon Prime9

GodFather Collections: గాడ్ ఫాదర్ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తుంది !

god father prime9news

god father prime9news

GodFather Collections: మెగాస్టార్ చిరంజీవి,బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’.ఈ సినిమా మోహన్ రాజా దర్శకత్వం వహించగా ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.అక్టోబర్ 5న ప్రేక్షకుల వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ఫుల్ రన్లో కొనసాగుతుంది.నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ.42.43 కోట్లు షేర్ కలెక్షన్స్ సాధించాయి.ఇక గ్రాస్ వసూళ్ల ప్రకారం చూసుకుంటే రూ. 77.20 కోట్లు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు దగ్గరగాగా ఉంది.గాడ్ ఫాదర్ సక్సెస్‌తో మెగాభిమానుల్లో ఓ కొత్త ఉత్సాహం నెలకొంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజున గాడ్ ఫాదర్ ఈ సినిమా రూ. 5.62 కోట్లు షేర్ కలెక్షన్స్ సాధించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ. 9.28 కోట్లు
సీడెడ్ – రూ.7.35 కోట్లు
ఉత్త‌రాంధ్ర – రూ.4.07 కోట్లు
ఈస్ట్ – రూ. 2.89 కోట్లు
వెస్ట్ – రూ 1.60 కోట్లు
గుంటూరు – రూ.3.15 కోట్లు
కృష్ణా – రూ. 1.93 కోట్లు
నెల్లూరు – రూ. 1.46 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాద‌ర్ సినిమా రూ.31.731 కోట్లు షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.దీన్ని గ్రాస్ వ‌సూళ్ల ప్ర‌కారం చూసుకుంటే రూ. 52.70 కోట్లు అని ట్రేడ్ వర్గాల నుంచి తెలిసిన సమాచరం.

Exit mobile version
Skip to toolbar