Site icon Prime9

Gangavva : ఒక్క రోజు గంగవ్వ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా ?

gangavva prime9news

gangavva prime9news

Gangavva : తెలుగు రాష్ట్రాల వరకు మై విలేజ్ షో గంగవ్వ అంటే తెలియని వాళ్లంటూ అంటూ ఎవరు లేరు.మారుమూల గ్రామంలో ఎక్కడో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి గంగవ్వ ఒక్కసారిగా చాలా ఫేమస్ అయ్యారు.ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె పల్లె వాతావరణానికి సంబంధించిన అన్ని విషయాలను అందరితో పంచుకుంటూ క్రేజును తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.ఆమె బంధువుల సహాయంతో వీడియోలు చేస్తూ పాపులారిటీ అయ్యారు.ఇలా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గంగవ్వ ఏకంగా బిగ్ బాసులో అవకాశాన్ని అందుకుని..అక్కడ కూడా అందరినీ అలరించింది.

ఈ క్రమంలోనే గంగవ్వ పలు సినిమాలలో సందడి చేసిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే.ఇకపోతే సాధారణంగా చిన్నచిన్న సెలబ్రిటీలకు నిర్మాతలు కేరవాన్ సదుపాయాన్ని కల్పించరు.కానీ గంగవ్వకు మాత్రం ప్రత్యేకంగా కేరవాన్ ఏర్పాటు చేసిన విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు.ఇలా యూట్యూబ్ ఛానెల్ ఒక్కటే నమ్మకోకుండా పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది గంగవ్వ .ఐతే ఇప్పుడు అందరి కన్ను గంగవ్వ మీద పడింది.. గంగవ్వ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని అనే విషయంపై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నరని టాక్.గంగవ్వ ఒక రోజు సినిమా షూటింగులో పాల్గొంటే పది వేలు తీసుకుటుందని తెలిసిన సమాచారం.

Exit mobile version