Site icon Prime9

Fire Accident: అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్ ను తగులబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

fire accident in theater at west godavari dist

fire accident in theater at west godavari dist

Fire Accident: పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్, ఆరడుగల అందగాడు ప్రభాస్. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ కు గూస్ బమ్స్ వస్తాయి. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ 43వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యాన్ బిల్లా సినిమాను 4Kలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అభిమానుల అత్యుత్సాహం వల్ల ఓ థియేటర్ కాలిపోయింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటుచేసుకుంది.

ప్రభాస్ అభిమానులు చేసిన రచ్చ కారణంగా థియోటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణంలోని వెంకట్రామ థియేటర్లో ఆయన ఫ్యాన్స్ అసోయేషన్ ఆధ్వర్యంలో బిల్లా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో అభిమానులు కాస్త అత్యుత్సాహం కనపరిచారు. సినిమా థియోటర్లలోని సీట్ల మధ్య బాణాసంచా కాల్చారు. దానితో సీట్లన్నీ కాలిపోయి థియేటర్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హుటాహుటిన థియేటర్ యాజమాన్యం మరియు సినిమా చూడడానికి వచ్చిన ప్రజలు కొంతమంది ఆ మంటలను ఆర్పేశారు. థియేటర్ మొత్తం పొగ వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇదీ చదవండి: ఆదిపురుష్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్.. అప్డేట్ చూసి ఏడుస్తున్న జనం

Exit mobile version