Site icon Prime9

Vijay Devarakonda: “ఖుషి” సినిమాపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

vijay devarakonda clarity on khushi movie release

vijay devarakonda clarity on khushi movie release

Vijay Devarakonda: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే ప్రేమ కథ చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. ఇటీవల విజయ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కాగా గత కొద్ది నెలల క్రితం ఎన్నో ఆశలు పెట్టుకుని దాదాపు రెండున్నర సంవత్సరాలు టైం కేటాయించి తీసిన “లైగర్” సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో విజయ్ కాస్త ఆలోచనలో పడ్డాడు.

ఇదిలా ఉంటే ఖుషి మూవీ డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు చిత్ర బృందం. కానీ ఈ సినిమాలో విజయ్ కు జోడీగా నటిస్తోన్న సమంత ఇటీవల మయోసైటిస్ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైయ్యింది. ఈ తరుణంలో ఖుషి సినిమా విడుదలపై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై మరియు మూవీ రిలీజ్ పై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తారీకున ”ఖుషి” రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మరోపక్క విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తూ ఉన్నాయట.

ఇదీ చదవండి: సుధీర్ “గాలోడు” చిత్రం ట్రైలర్ అదిరింది

Exit mobile version