Site icon Prime9

Karthi: ఆ స్టార్ హీరో కార్తీ ఫేస్‌ బుక్‌ హ్యాక్‌

hero karthi face book was hacked

hero karthi face book was hacked

Karthi: తమిళ, తెలుగు ఆడియెన్స్‌కు కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెరపైనే కాకుండా నెట్టింట కూడా ఫుల్ జోష్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తుంటాడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో. అలాంటి కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ మేరకు కార్తీ ట్వీట్ ద్వారా తన అభిమానులను అప్రమత్తంగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. కార్తీ ట్వీట్ లో హలో గాయ్స్. నా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయింది.ఫేస్ బుక్ టీంతో కలిసి పని చేస్తున్నాం. నా పేజీని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు కార్తీ. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లో వల్లవరాయ అంటూ అలరించాడు. మొదటి పార్ట్ మొత్తం కూడా కార్తీ చుట్టూనే తిరిగింది. అంతేకాకుండా రీసెంట్‌గా సర్దార్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇదీ చదవండి: ఈ వారం చిన్న చిత్రాలదే హవా..!

Exit mobile version