Samantha: “సమంత”.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.స్విమ్ సూట్ ధరించి సమంత చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ ఇటువంటి డ్రస్ వేయడం కొత్త కాదు. సిల్వర్ స్క్రీన్ మీద సూర్య ‘సికిందర్’ కోసం బికినీ ధరించారు. ఓ పాటలో గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. అయితే… ఫైనల్ ఎడిట్ నుంచి ఆ బికినీ క్లిప్ డిలీట్ చేశారు. సినిమాల్లో సామ్ అందంగా కనిపించారు. కానీ, బికినీ లేదా స్విమ్ సూట్ వంటివి వేయలేదు. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫొటో షూట్ చేశారు.
సినిమాలకు వస్తే… ప్రస్తుతం సమంత కొత్త సినిమాలు ఏవీ అంగీకరించడం లేదు. ‘ఖుషి’ తర్వాత షూటింగుల నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో చేస్తున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్ కూడా ఆవిడ పూర్తి చేశారు. ఒక వైపు మయోసైటిస్ చికిత్స తీసుకుంటూ మరో వైపు ఫోటో షూట్స్ చేస్తూ గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలను మీరు ఓ లుక్ వెయ్యండి ..