Site icon Prime9

RGV Vyooham: తగ్గేదేలే అంటున్న ఆర్జీవీ.. వ్యూహం నుంచి పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫస్ట్ లుక్స్ రివీల్

RGV Vyooham

RGV Vyooham

RGV Vyooham: ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి జీవితంలోని వాస్తవిక సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తోన్న మూవీ వ్యూహం. అయితే ఈ సినిమా మొత్తం (వ్యూహం, శపథం) రెండు పార్టులుగా రూపొందుతున్నట్టు ఇప్పటికే ఆర్జీవీ వెల్లడించారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్‌ లుక్స్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రాజకీయ వర్గాల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి.

పవన్ కళ్యాణ్, చిరంజీవిల ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌(RGV Vyooham)

అయితే వర్మ దీనిపై ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా వ్యూహం సినిమాకు సంబంధించి మరో అప్డేట్‌ ఇచ్చారు ఆర్జీవీ. ఈ మూవీలోని పవన్ కళ్యాణ్, చిరంజీవిల ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ మేరకు వీరిద్దరూ కలిసున్న ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్‌ చేశాడు. దీనికి 2+2=1 అని వెరైటీగా క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారాయి. అంటే వ్యూహం సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల ప్రస్తావన ఉంటుందని ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. ఈ కొత్త పోస్టర్‌ చూస్తోంటే 2019 ఎన్నికల తర్వాత పవన్‌ చిరంజీవితో ఏదో మాట్లాడి వెళ్లిపోతున్నట్లుగా తెలుస్తోంది.

 

ఇక టీజర్‌లో వైఎస్సార్‌ చనిపోవడం, ఆ బాధను దిగమింగుకోలేక ఎంతో మంది వైఎస్సార్ అభిమానులు చనిపోవడం, ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామలను చూపించారు. అలాగే జగన్‌పై అక్కసులు, కొత్త పార్టీ ఏర్పాటు అంశాలను చూపిస్తూ ఈ టీజర్‌ను కట్‌ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు వంటి రాజకీయ నేతలు ఇప్పటికే వర్మకు హెచ్చరికలు జారీ చేశారు. సోనియాను కానీ ఇతర పార్టీనేతలను కించపరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మరి వాటిని ఆర్జీవీ పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది తర్వాతి మాట అయితే ఇప్పుడు ఏకంగా చిరంజీవి, పవన్‌ కల్యాణ్ లుక్స్‌ను రిలీజ్‌ చేశాడు. మరి దీనిపై మెగాభిమానులు ఏ విధంగా రియాక్టవుతారో వేచి చూడాలి.

Exit mobile version
Skip to toolbar