Pathaan: వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య.. జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరినట్లు.. యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ ప్రకటించింది.
భారీ వివాదాల నడుమ.. బాలీవుడు కింగ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలైంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నిరసనల మధ్య విడుదలై.. సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా వసూళ్లలో రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే వరుస ప్లాపులతో కుగిపోయిన బాలీవుడ్ సినిమాకు.. పఠాన్ ప్రాణం పోసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. భారీ అంచనాల మధ్య గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో షారుక్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను అలరించాడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు.. తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడంతో.. ఆడియెన్స్ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యాక.. బాలీవుడ్‌లో మరే ఇతర పెద్ద సినిమా రాకపోవడం ఈ సినిమాకు కలిసివచ్చింది. ఇక ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా.. ఈ సినిమాకు అడిక్ట్ అవుతున్నారు. ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరినట్లు యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ పేర్కొంది. ఈ సినిమాను రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున వ్యతిరేకత చోటు చేసుకుంది. దీంతో పెట్టిన బడ్జెట్ ని అయినా రాబట్ట గలదా? అని సందేహించారు. కానీ ఆ అనుమానాలను పటాపంచెలు చేస్తూ.. సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా భారీ విజయంతో.. ఇప్పుడు బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకువచ్చింది.
ఈ సినిమాపై మెుదట్లో వ్యతిరేకత రావడంతో.. టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ కలెక్షన్స్ సాధించిన మొదటి హిందీ చిత్రంగా పఠాన్ రికార్డులకెక్కింది. బాలీవుడ్ కింగ్ ఖాన్.. నటించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్‌లో షారుఖ్ ఇందులో నటించాడు.