Site icon Prime9

Kantara: కాంతార మూవీకి కోర్ట్ బిగ్ షాక్.. థియేటర్లలో నిలిపివేయాలంటూ ఆదేశం..!

court big shock to Kantara movie song

court big shock to Kantara movie song

Kantara: భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న కాంతార చిత్రానికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కేరళ ఆదివాసీల సంప్రదాయ భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే కోర్టులో కాపీరైట్ ఇష్యూ నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని వరాహ రూపం దైవవరిష్టం పాటను థియేటర్లలో ప్లే చేయకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాంతార చిత్రానికి గుర్తింపు తెచ్చిన ఫేమస్ సాంగ్ అయిన వరాహ రూపం దైవవరిష్టం పాటను కాపీ కొట్టారంటూ మలయాళ సంగీత బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాము గతంలో రూపొందించిన నవరస పాటను కాపీ చేశారంటూ ఆ మ్యూజిక్ బ్యాండ్ కోజికోడ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు.. కాపీరైట్ ఉల్లంఘన చేశారని పేర్కొంటూ థియేటర్లలో ఈ సాంగ్ ప్లే చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ టీమ్ అనుమతి లేకుండా కాంతార చిత్రంలో వరాహ రూపం సాంగ్ ప్లే చేయకూడదని నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడి కోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్ వంటి తదితర స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లకు ఈ పాటపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి స్వీయదర్శకత్వం చేపట్టిన చిత్రం కాంతారకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. కేవలం కన్నడలో కాకుండా ఉత్తరాదిలోనూ భారీ వసూల్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ ఏడాది విడుదలైన అతి పెద్ద విజయాలు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది కాంతార సినిమా.

ఇదీ చదవండి: సౌత్ ఇండియాలోనే మహేష్ టాప్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Exit mobile version