Site icon Prime9

Rajinikanth: సరికొత్తగా “బాబా” వచ్చేస్తున్నాడు.. డిసెంబర్ 12న రీ రిలీజ్

baba movie re release

baba movie re release

Rajinikanth: టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజు పురస్కరించుకుని వారి సూపర్ హిట్ చిత్రాలను మరోసారి రిలీజ్ చేస్తుండగా.. వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రీ రిలీజ్ సంప్రదాయం దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకూ వ్యాపించింది. ఇకపోతే డిసెంబర్ 12న సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘బాబా’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.

20 ఏళ్ల కిందట భారీ అంచనాలతో వచ్చిన ‘బాబా’ బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. అయితే, రజినీకాంత్ స్టైల్, డైలాగ్స్ మాత్రం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. దాంతో, ఈ మూవీని రీరిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని డిజిటల్‌గా క్వాలిటీ పెంచడంతో పాటు రీ ఎడిట్‌ చేస్తున్నారని టాక్. దాదాపుగా మూడు గంటల నిడివి ఉండే ఈ సినిమాను రీ ఎడిట్ చేస్తూ 13 కొత్త సీన్స్ ను కలిపి రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ‘బాబా’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఇప్పటికే చాలా థియేటర్లు ముందుకొస్తున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తమిళంలో మాత్రమే రీరిలీజ్ చేస్తారా? లేదా తెలుగులోనూ తీసుకొస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు.

ఇదీ చదవండి: నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్.. ఎందుకో తెలుసా..?

Exit mobile version