Site icon Prime9

Vijay Deverakonda : ఫ్యామిలీ మ్యాన్ మూవీ నుండి అభిమానులకు దివాళి స్పెషల్ పిక్ రిలీజ్ ..

family man movie new poster release

family man movie new poster release

Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ నిండి వచ్చిన “ఐరన్ ఏ వంచాలా ఏంటి ” అనే డైలాగ్ సోషల్ మీడియా లో ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికి తెలుసు. అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ కి గీతగోవిందం వంటి సూపర్ సక్సెస్ ని అందించిన పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా నేడు దీపావళి కావడంతో సెలబ్రిటీస్ అంతా అభిమానులకు అప్డేట్స్ రూపంలో బహుమతులు ఇస్తున్నారు.

ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మ్యాన్ మూవీ నుండి కొత్త అప్డేట్ ఇచ్చారు . అది ఏంటి అంటే హ్యాపీ దివాళీ అంటూ ఒక ఫోటో షేర్ చేశారు. ఆ పిక్ లో విజయ్, మృణాల్ తో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించారు. ఈ ఫోటో ఫ్యామిలీ స్టార్ సినిమాలోని స్టిల్. దీవాళి కి జంట దీపం పెడుతున్న పిక్స్ ఎన్ని చూసినా ఈ పిక్ సంథింగ్ స్పెషల్ లా అనిపించింది . ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. విజయ్ తండ్రి, భర్తగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక విజయ్ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ కూడా చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమాకంటే ముందుగా ఈ సినిమానే ప్రకటించారు. కానీ ఈ VD12ని పక్కన పెట్టి విజయ్ ఫ్యామిలీ స్టార్ సంగతి చూస్తున్నారు. దీంతో గౌతమ్ తిన్ననూరి  చేసేది ఏం లేక తను కూడా ఈ సినిమాని పక్కన పెట్టి ఒక చిన్న హీరోతో ఒక సినిమా మొదలుపెట్టారని టాక్ వినిపిస్తుంది. విజయ్ సినిమా పట్టాలు ఎక్కేలోపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి రిలీజ్ చేయడానికి గౌతమ్ ప్లాన్ చేశారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

Exit mobile version