Site icon Prime9

Vakeel Saab 2 : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బొమ్మ దద్దరిల్లిపోయే గుడ్ న్యూస్.. త్వరలోనే వకీల్ సాబ్ 2 !

director venu sriram interesting words about vakeel saab 2

director venu sriram interesting words about vakeel saab 2

Vakeel Saab 2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా “వకీల్ సాబ్”. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా కాలం తరువాత పవర్ స్టార్ ను ఈ చిత్రంతో  బిగ్ స్క్రీన్ మీద చూసి ఫుల్ ఫిదా అయిపోయారు. అంజలి, నివేతా థామస్, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి తమన్ సంగీతం డబుల్ బొనాంజా గా మారింది. ఈ సినిమా విజయం సాధించి పవన్ కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టింది.

‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వేణు శ్రీరామ్.. ఆ తరువాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వకీల్ సాబ్  సూపర్ హిట్ సాధించడంతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్’ సినిమా చేయాలని దిల్ రాజు అనుకున్నాడు గానీ  ఎందుకనో గానీ బన్నీ ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదు. ఆ కథపై చాలా కాలం పాటు కసరత్తూ చేస్తూ వచ్చిన వేణు శ్రీరామ్ మొత్తానికి దానిని పక్కన పెట్టేశాడు. కాగా నిన్నటితో ఈ సినిమా రెండేళ్లను పూర్తి చేసుకుంది.

ఈ సినిమా సాధించిన సక్సెస్ ను గురించి వేణు శ్రీరామ్ గుర్తు చేసుకుంటూ.. ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పి పవన్ అభిమానులకు బొమ్మ దద్దరిల్లే గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను రెడీ చేస్తున్నానని త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పాడు. ఈ వార్తతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మళ్ళీ పూనకాలు స్టార్ట్ అయ్యాయి.

అదే విధంగా మూడు ప్రాజెక్టులకు స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నానని తెలిపారు. వకీల్ సాబ్ సీక్వెల్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ అయ్యాక పవన్ గారికి వినిపిస్తాను అని తెలిపాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆ చిత్రాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కొంత పూర్తి అయ్యింది. సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అది ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 28న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

Exit mobile version