Site icon Prime9

Director Shankar: సూర్యతో శంకర్ మూవీ.. 1000 కోట్ల భారీ బడ్జెట్..!

director shankar crazy movie with hero suriya

director shankar crazy movie with hero suriya

Director Shankar: టాలెంటెడ్ ఇండియన్ డైరెక్ట‌ర్ల‌లో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఈ ద‌ర్శ‌కుడు మూవీ చేస్తున్నాడంటే ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఉంటాయి. త‌న‌దైన శైలిలో చిత్రాలు రూపొందించి దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శంక‌ర్ ప్ర‌స్తుతం విల‌క్ష‌ణ నటుడు క‌మ‌ల్ హాస‌న్‌తో భారతీయుడు 2, టాలీవుడ్ స్టార్ హీరో రాంచ‌ర‌ణ్‌తో ఆర్‌సీ 15 వంటి చిత్రాలను చేస్తున్నాడు. ఇదిలా ఉండగా దర్శకుడు శంక‌ర్ మ‌రో సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది.

త‌మిళ న‌వ‌ల వేల్ప‌రి ఆధారంగా ఈ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న టాక్ వినిపిస్తుంది. చరిత్ర నేపథ్యంలో రూపొందించబోతున్న ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య.. కీలక పాత్రలో నటించబోతున్నాడని సినీ పరిశ్రమలో గుసగుసలు నడుస్తున్నాయి. రీసెంట్‌గా విరుమ‌న్ ఆడియో లాంచ్ సందర్భంగా సూర్య కూడా ఈ సినిమాకు సంబంధించి ఓ హింట్ ఇవ్వ‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరిందనే చెప్పాలి.

ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించేందుకు శంక‌ర్ సన్నాహాలు చేస్తున్నారట కాగా సూ వెంకటేశ్ ఈ మూవీ క‌థ‌నందిస్తాడన్న టాక్ టాలీవుడ్లో గట్టిగానే వినిపిస్తుంది. మొత్తానికి ఈ క్రేజీ అప్‌డేట్ తో సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో బిగ్గెస్ట్ మూవీ రాబోతుంద‌ని చెప్పవచ్చు. ఇక దీనిపై పక్కా క్లారిటీ రావాలంటే కొంత‌కాలం వేచిచూడాల్సిందే.

ఇదీ చూడండి: Suriya: సూర్య 42 మోషన్ పోస్టర్ రిలీజ్.. యుద్ధభూమిలో అతి పరాక్రమవంతుడిగా లుక్

Exit mobile version