Dil Raju: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన నిర్మాత దిల్‌ రాజు – రెండు రోజుల్లో టాలీవుడ్‌తో భేటీ

  • Written By:
  • Updated On - December 24, 2024 / 05:27 PM IST

Dil Raju Visit Sritej in Hospital: సంధ్య థియేటర్‌ ఘటన దురదృష్టకరమని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. తాజాగా కిమ్స్‌ ఆస్పత్రిలో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడని చెప్పారు. రాత్రి అమెరికాలో నుంచి వచ్చిన ఆయన తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

ఇండస్ట్రీ తరపున శ్రీతేజ్‌ వ్యవహరంలో ప్రభుత్వంతో సమన్వయం చేయమని సీఎం అన్నారని అన్నారు. ఎఫ్‌డీసీ(FDC) ఛైర్మన్‌గా సినీ ఇండస్ట్రీ తరపున బాధ్యత తీసుకుంటానని, పభుత్వం, ఇండస్ట్రీ మధ్య ఎలాంటి కాంట్రవర్సి లేకుండ తాను సమన్వయం చేస్తానని అన్నారు. ఇక శ్రీతేజ్ కుటుంబానికి సినీ పరిశ్రమ అండగా ఉంటుందని, చనిపోయిన రేవతి భర్త భాస్కర్‌కు ఇండస్ట్రీలో ఏదైన ఉద్యోగం కల్పిస్తామని అన్నారు.

మరో రెండు మూడు రోజుల్లో టాలీవుడ్‌ పెద్దలతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమవుతామన్నారు. త్వరలోనే అంతా సమసిపోయే దిశగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇండస్ట్రీ వ్యక్తిగా అల్లు అర్జున్‌ని కూడా కలుస్తానని ఆయన అన్నారు. చివరిగా భగవంతుడి దయవల్ల శ్రీతేజ్ కోలుకోవాలని ఆశిస్తున్నా. రెండు రోజుల క్రితం శ్రీతేజ్‌ని వెంటిలెటర్‌ నుంచి తీశారన్నారు. వైద్యానికి రెస్పాండ్‌ అవుతున్నారని దిల్‌ రాజు పేర్కొన్నారు.