Site icon Prime9

Acharya: ఆచార్య సెటిల్మెంట్ కోసం రూ.20 కోట్లు చెల్లించిన మెగా హీరోలు ?

Tollywood: ఆచార్య డిజాస్టర్‌తో నష్టపరిహారం కోసం దర్శకుడు కొరటాల శివపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేయడం ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. కొరటాల బయ్యర్లలో ఒకరికి నష్టపరిహారం చెల్లించి సెటిల్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తుండగా, మెగా క్యాంప్ నుండి కొత్త రిపోర్ట్ వచ్చింది.

ఆచార్య వల్ల జరిగిన నష్టానికి పరిహారంగా మెగాస్టార్ చిరు మరియు రామ్ చరణ్ తమ వాటా నుండి 20 కోట్ల రూపాయల మొత్తాన్ని తిరిగి ఇచ్చారని మెగా క్యాంప్ టాక్. చాలా మంది స్టార్ హీరోలకు భారీ ఫ్లాప్‌లు ఉన్నాయి, కానీ ఎగ్జిబిటర్ల నష్టాలను తీర్చడానికి హీరోలు తమ రెమ్యునరేషన్‌ను వదులుకున్న సందర్భాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు,

Exit mobile version