Site icon Prime9

Mukesh Gowda : హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ హీరో రిషి ..

details about serial hero mukesh gowda first movie

details about serial hero mukesh gowda first movie

Mukesh Gowda : టీవీ సీరియల్స్ తో  మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముకేశ్ గౌడ.. గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ తో ప్రేక్షకులలో తనకి అంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంది. ఇక ముకేశ్ గౌడకి అమ్మాయిల్లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది.మోడలింగ్‌తో తన కెరియర్ మొదలు పెట్టి, 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను గెల్చుకున్నాడు.ఆ తరువాత కన్నడలో అడుగుపెట్టి ‘నాగకన్నిక’ అనే సీరియల్‌తో డెబ్యూ హీరోగా మన ముందుకు వచ్చాడు.‘ప్రేమ నగర్’ సీరియల్‌తో తెలుగు టెలివిజన్లో అడుగుపెట్టాడు.అయితే ఇప్పుడు ఈ సీరియల్ హీరో సినిమా హీరోగా మారుతున్నాడు.

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘గీతా శంకరం’ అనే టైటిల్ ని ప్రకటించారు. ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ నెల 14 నుండి సినిమా షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో ముకేశ్ గౌడ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ గీతా శంకరం సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాంక గతంలో తెలుగులో మెన్ టూ, తంతిరం.. అనే పలు సినిమాల్లో నటించింది.

ఈ సందర్భంగా ముకేశ్ గౌడ మాట్లాడుతూ.. ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న మొదటి సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్‌ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది లవ్‌ అండ్‌ ఎఫక్షన్‌తో కూడుకున్న సినిమా. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది. యూత్‌కు ఈ గీతా శంకరం సినిమా బాగా నచ్చుతుంది అని తెలిపారు.

 

 

Exit mobile version