Site icon Prime9

Dasara Movie: నాని దసరా.. “ధూమ్ ధామ్ దోస్తాన్” పాట రిలీజ్ ఎప్పుడంటే..?

dasara movie first single release date announced

dasara movie first single release date announced

Dasara Movie: శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ దసరా. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌చేశాయి. అయితే తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. దసరా సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’పాటను అక్టోబర్‌ ౩న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని ఊరమాస్‌ లుక్ లో ప్రేక్షకులకు కనిపిస్తున్నాడు.

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీలో నానీ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఈ చిత్రంలో నాని, కీర్తి డీ గ్లామర్‌ పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కొత్త కథలతో మెప్పించాలనుకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. ఆయన తాజాగా మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ పెంచుకోవాలని ఎంతగానో తాపత్రయపడుతున్నారు.

ఇదీ చదవండి: అట్టహాసంగా అల్లు స్టూడియోస్ ప్రారంభం.. అల్లు వారు తరతరాలు గుర్తుంచుకోవాలి- చిరు

Exit mobile version