Custody OTT: అక్కినేని నాగచైతన్య తాజాగా కానిస్టేబుల్ పాత్రలో నటించిన చిత్రం ‘కస్టడీ’. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 12 న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఇపుడు కస్టడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 9 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రైమ్ ట్వీట్ పెట్టింది. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని చూడొచ్చు. నాగ చైతన్య కెరీరఖ్ లో భారీ కాస్ట్ తో, భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే థియేటర్స్ లో మిశ్రమ ఫలితాలు అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా అలరించబోతుంతో చూడాలి.
కస్టడీ స్టోరీ ఏంటంటే?(Custody OTT)
ఈ కథ 1996లో జరిగింది. నాగచైతన్య నిజాయతీ గల పోలీస్ కానిస్టేబుల్. సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిసుంటాడు. ప్రేమించిన అమ్మాయి కృతి శెట్టిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అయితే పెద్దలు అంగీకరించక పోవడంతో వీరిద్దరూ ఎక్కడికైనా వెళ్లి పోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే నాగ చైతన్యను ఓ కారు ఢీ కొడుతుంది. అందులో కరుడుగట్టిన నేరస్థుడు అరవింద్ స్వామి, సీబీఐ అధికారి సంపత్ రాజ్ గొడవ పడుతుంటారు. వాళ్లను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేసి స్టేషన్‌లో పెడతాడు నాగ చైతన్య. అయితే ముఖ్యమంత్రి ప్రియమణి ఆదేశం ప్రకారం స్టేషన్‌లో ఉన్న రాజును చంపేందుకు పోలీస్ కమిషనర్ శరత్ కుమార్ రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజును చంపాలని ముఖ్యమంత్రి ఎందుకు ఆదేశించింది? అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి ప్రాణాలతో రక్షించిన నాగచైతన్య బెంగళూరుకు ఎందుకు తీసుకెళ్లాలనుకుంటాడు? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.