Site icon Prime9

Comedian Sudhakar : నేను బ్రతికే ఉన్నాను.. ఐ యామ్ వెరీ హ్యాపీ అంటున్న కమెడియన్ సుధాకర్

comedian sudhakar responce on fake news about his death

comedian sudhakar responce on fake news about his death

Comedian Sudhakar : తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి. తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా తెరకెక్కించిన సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు సుధాకర్. టాలీవుడ్ లో నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు ఆయన. 1980 నుంచి 2005 సినిమాల్లో నటించగా.. ఆ తర్వాత 12 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2017 లో ‘ఇ ఈ’ చిత్రంలో చివరిగా నటించారు. ఇప్పటి వరకు సుధాకర్ అన్ని భాషల్లో కలిసి 600కు పైగా చిత్రాల్లో నటించారు. అదే విధంగా ప్రొడ్యూసర్ గానూ పలు చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

కాగా చిత్ర పరిశ్రమను ఇటీవల కాలంలో వరుస విషాదలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్,  సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కొలుకునే లోపే మరో సీనియర్ కమెడియన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కాలంలో వస్తున్న ఫేక్ వార్తలకు కొదువే లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం నుంచి సుధాకర్ మరణించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనే స్వయంగా ఈ వార్తలపై స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. సుధాకర్ స్వయంగా వివరణ ఇవ్వడంతో అభిమానులంతా ఉపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో సుధాకర్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. నా మీద వచ్చిన న్యూస్ ఫేస్ న్యూస్. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాగే దాన్ని వ్యాప్తి చేయొద్దు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను.. ఐ యామ్ వెరీ హ్యాపీ’ అంటూ తంబ్సప్ చూపిస్తూ నవ్వుతూ చెప్పారు. అయితే, ఈ వీడియోలో సుధాకర్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఒకప్పుడు గుండ్రటి మొహం, బుగ్గలతో ఉన్న సుధాకర్.. వయస్సు రీత్యా పూర్తిగా మారిపోయారు. దీంతో సుధాకర్‌ను ఈ వీడియోలో చూసిన చాలా మంది.. అయ్యో ఆయన ఇలా అయిపోయారేంటి అని కామెంట్లు పెడుతున్నారు. సుధాకర్ ఆరోగ్యంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version