CM Revanth Reddy fires on Tollywood: సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో ఆయన ప్రస్తావించారు. ఇకపై సినిమాలకు బెన్‌ఫిట్ షోలు, ప్రీమియర్స్ ఉండవంటూ సంచలన ప్రకటన చేశారు. సినిమాలు వాళ్లు వ్యాపారం చేసుకోండి, డబ్బుల సంపాదించుకోండి.. మానవత్వం లేకుండ వ్యవహరించకండి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేది ఎవరినైనా మా ప్రభుత్వం వదిలిపెట్టదు. సినీ పరిశ్రమకు ఇక్కడ ప్రత్యేకంగా రాయితీ ఏం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఓ ఘటన ప్రత్యేకంగా, పరోక్షంగా కారణమైన ప్రతి ఒక్కరిపై కేసు పెట్టాల్సిందే.
అల్లు అర్జున్ అరెస్ట్ అయితే సినీ పరిశ్రమ మొత్తం కదిలింది. ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించింది. ఆయన ఏమైందని ఈ పరామార్శలు, కన్ను పోయిందా, కాలు విరిగిందా? అని సీఎం ఫైర్ అయ్యారు. అదే సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని ఏ ఒక్కరైనా పరామర్శించారా? బాలుడు ఆస్పత్రిలో ఉంటే ఎవరైనా వెళ్లారా?. సామాన్య ప్రజల ప్రాణాలు అంటే అంత లెక్కలేదా? అని ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అదే విధంగా సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి, అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం ప్రస్తావించారు. సంధ్య థియేటర్‌కు పోలీసులు రావద్దన్నా అల్లు అర్జున్ వచ్చారన్నారు. వచ్చిన అతను సైలెంట్ సినిమా చూసి వెళ్లుంటే ఈ ఘటన జరిగి ఉండకపోవచ్చేమో కానీ, ర్యాలీగా వచ్చారు.
దీంతో ఆయనను చూసేందుకు ప్రజలు ఉప్పెన ఎగసిపడటంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి మరణించింది. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీనికి ఎవరూ బాధ్యుతులు. మహిళా చనిపోయిన సమయంలో కూడా అల్లు అర్జున్ కారు రూఫ్ టాప్‌పై చేయి ఊపుతూ వెళ్లాడు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోవాలని చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించిన థియేటర్ యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. ఏసీపీ ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించడంతో అప్పుడు అనుమతి ఇచ్చారు.
తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఆయన కారు ఎక్కి సైలెంట్‌గా వెళ్లలేదు. చేయి ఊపూతూ హంగామా చేయడంతో చూట్టు పక్కల ఉన్న థియేటర్‌కి వచ్చిన వారు కూడా సంధ్య థియేటర్‌కి వచ్చారు. దీంతో అక్కడ వేల సంఖ్యలు ప్రజలు గుమికూడారు. గేటు తియగానే అంతా ఉప్పెనలా ఎగిసిపడటంతో తొక్కిసలాట జరిగింది. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా.. శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా వినలేదు.
బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు. దీంతో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిస్తే ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారన్నారు.