Pathaan Box Office: వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య.. జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద.. సరికొత్త చరిత్ర సృష్టించింది.
భారీ వివాదాల నడుమ.. బాలీవుడు కింగ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలైంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నిరసనల మధ్య విడుదలై.. సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా వసూళ్లలో రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే వరుస ప్లాపులతో కుగిపోయిన బాలీవుడ్ సినిమాకు.. పఠాన్ ప్రాణం పోసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో షారుక్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను అలరించాడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు.. తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడంతో.. ఆడియెన్స్ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యాక.. బాలీవుడ్‌లో మరే ఇతర పెద్ద సినిమా రాకపోవడం ఈ సినిమాకు కలిసివచ్చింది. ఇక ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా.. ఈ సినిమాకు అడిక్ట్ అవుతున్నారు. ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా పఠాన్ మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 15 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి.. తన సత్తా చాటింది. ఇండియన్ సినిమాల్లో ఈ రికార్డు సాధించిన రెండో చిత్రంగా పఠాన్ నిలిచింది. బాహుబలి-2 తరువాత ఈ మార్క్‌ను అందుకున్న మూవీగా పఠాన్ రికార్డు నెలకొల్పింది.
బాలీవుడ్ కింగ్ ఖాన్.. నటించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్‌లో షారుఖ్ ఇందులో నటించాడు.