Site icon Prime9

Sunny Leone: నా భర్త నన్ను మోసం చేశాడు.. అతనో చీటర్ అంటున్న సన్నీలియోన్

Sunny leone

Sunny leone

Sunny Leone: స్టన్నింగ్ బ్యూటీ స‌న్నీ లియోన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక‌ప్పుడు శృంగార తార‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో నటిగా రాణిస్తోంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ అటు బాలీవుడు, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రపరిశ్రమలోనూ మంచి క్రేజ్ సంపాధించింది ఈ అమ్మడు. ఇక సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో సరదాగా గడుపుతూ వెకేష‌న్ల‌ వింధులు వినోదాలకు వెలుతూ ఉంటుంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానుల‌తో తన సినిమా అప్ డేట్స్ కు సంబంధించిన విష‌యాల‌ను పంచుకుంటూ ఉంటుంది.

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వెబెర్(Sunny Leone)

ప్ర‌స్తుతం స‌న్నీ త‌న భ‌ర్త డానియెల్ వెబెర్‌, పిల్ల‌ల‌తో క‌లిసి దుబాయ్ వెకేష‌న్‌లో జాలీగా ఎంజాయ్ చేస్తుంది. కాగా తన భ‌ర్త త‌న‌ను మోసం చేస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న‌ట్లు చెబుతూ తాజాగా ఇన్ స్టా వేదికగా సన్నీ ఓ వీడియోను పోస్ట్ చేసింది. మొదట ఈ వీడియో కాకుండా కాప్షన్ మాత్రమే చూసిన ప్రజలంతా నోరెళ్లబెట్టారు. అయితే నిజానికి ఆ వీడియోలో ఏముందంటే.. డానియెల్ వెబెర్ కిచెన్‌లో వెళ్లి ఏదో తింటుంటాడు. అద్దంలో నుంచి అత‌డి ప్రతిబింబాన్ని హాల్‌లో ఉన్న స‌న్నీ చూస్తుంది. ఏం చేస్తున్నావ‌ని అత‌డిని ప్ర‌శ్నించ‌గా నీళ్లు తాగుతున్నాను అంటూ స‌మాధానం చెప్పాడు.

అబ‌ద్దం చెప్ప‌కు అద్దంలో నీ ప్ర‌తిబింబం క‌నిపిస్తోంది. నువ్వు ఐస్‌క్రీమ్ తింటున్నావు అని తెలుసు. మ‌ర్యాద‌గా ఐస్‌క్రీమ్ తీసుకుని వ‌చ్చి ఇక్క‌డ కూర్చో అని సన్నీ అంటోంది. అప్పుడు అత‌డు ఐస్‌క్రీమ్ ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌స్తాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ నా భర్త నన్ను మోసం చేశాడు అంటూ రాసుకొచ్చింది స‌న్నీ లియోన్. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version