Jawan Teaser: తమిళ దర్శకుడు అట్లీ సినిమా వస్తుందంటే అంటే చాలు తన సినిమా ద్వారా సమాజానికి ఏదో ఒక మెస్సేజ్ ఇస్తారనే అర్థం. కాగా ఇప్పుడు ఈ తమిళ దర్శకుడు బాలీవుడ్ లో తనదైన మార్క్ చూపించాలని అభిప్రాయపడుతున్నట్టు తెలిస్తుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా జవాన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. ఈ మూవీలో బాలీవుడ్, టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తుతన్నారు.
ఇకపోతే ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా జవాన్ సినిమాని సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్న సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ ను శరవేగం చేసింది మూవీ టీం. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో షారుఖ్ సొంతంగా తన నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నాడు.
నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు(Jawan Teaser)
కాగా ఇటీవల జవాన్ సినిమా నుంచి ప్రివ్యూ రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు. దానితో రెండు రోజుల నుంచి షారుఖ్ అభిమానులు ఆ ప్రివ్యూ ఏంటా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా జవాన్ మూవీ నుంచి టీజర్ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం అన్నట్టు కనిపిస్తుంది. భారీ యాక్షన్ సీన్స్ తో టీజర్ హై లెవల్ లో ఉంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనుంది. ఇందులో షారుఖ్ ఆర్మ్ ఆఫీసర్ గా చూపించారు. ఇక చివర్లో షారుఖ్ గుండుతో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నేను విలన్ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు అనే డైలాగ్ అయితే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోందనే చెప్పాలి. ఇక మరీ ముఖ్యంగా విలన్ గా విజయ్ సేతుపతిని మరింత పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో అట్లీ బాలీవుడ్ లో విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. టీజర్ చూశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.