Site icon Prime9

Salman Khan: సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే మృతి

salman khan 3 prime9news

salman khan 3 prime9news

Bollywood: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో నిన్న మరణించారు. సల్మాన్ ఖాన్‌కు డూప్ గా పేరుగాంచిన సాగర్, స్టంట్ మ్యాన్‌గా బాలివుడ్ ఇండస్ట్రిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లు కాగా, శుక్రవారం మధ్యాహ్నం జిమ్‌లో వ్యాయమం చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. ఆ తరువాత ఆయన కన్నుమూశారు. బాలీవుడ్ ఇండస్ట్రిలో సినీ ప్రముఖులు సాగర్ ఫొటోను షేర్ చేస్తూ అతని మృతికి సంతాపం తెలిపారు. ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు ఉండే సాగర్, అకస్మాత్తుగా మరణించడంతో అందరినీ తీవ్ర విషాదానికి గురి చేసింది.

సాగర్ పాండే సల్మాన్ ఖాన్‌తో కలిసి చాలా సినిమాలకు పనిచేశారు. అతని మరణం పట్ల సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ‘నాతో ఉన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తమ్ముడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సాగర్ పాండే’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఈ క్రమంలో సాగర్ పాండేతో కలిసి దిగిన ఫొటోను అందరితో పంచుకున్నారు. ఈ ఫోటో పై హార్ట్ బ్రేక్ సింబల్‌ను యాడ్ పోస్ట్ చేశారు.

 

Exit mobile version