Site icon Prime9

Shah Rukh Khan: ఒక్కరోజైనా సెలవు తీసుకోండి మోదీ సార్.. షారుఖ్ సలహా

shah rukh khan tweet on modi

shah rukh khan tweet on modi

Bollywood: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని పలువురు ప్రముఖులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులు వివిధ రూపాల్లో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. కాగా ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దానిలో ఏముంది ప్రత్యేక అనుకుంటున్నారా అందులోనే ట్విస్ట్ ఉందండోయ్.

ప్రధాని మోదీకి షారుక్ పుట్టినరోజు సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలుతో పాటు మోదీకి ఒక చిన్న సలహా కూడా ఇచ్చాడు. మన దేశం మరియు ప్రజల అభివృద్ధి కోసం మీరు చేస్తున్న సేవ మరియు మీ అంకితభావం చాలా ప్రశంసనీయం. మీ లక్ష్యాలను సాధించడానికి మీకు బలం మరియు ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్, మీరు మరింత బలంతో చురుకుగా సేవ చెయ్యడానికి గానూ ఈ ఒక్క రోజైనా సెలవు తీసుకొని మీ పుట్టినరోజును ఆనందించండి అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇదీ చదవండి: PM Modi: కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను విడిచిపెట్టిన ప్రధాని మోదీ

Exit mobile version